Sunday, January 12, 2025

పేదలకు ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉంది: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంత భారమైనా పేదలకు ఇండ్లు ఇస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇవ్వడం అనేది అతి పెద్ద కార్యక్రమం అని ప్రశంసించారు. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ప్రసంగించారు.  తెలంగాణలో రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులున్నా కూడా రైతు రుణమాఫీ చేశామన్నారు.

అర్థిక భారమున్నా పథకాలు అమలు చేస్తున్నామని, పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని, బిఆర్‌ఎస్ సర్కార్ పది ఏళ్లు డైట్ ఛార్జీలు పెంచలేదని, ఇప్పుడు 40 శాతం పెంచామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్షమని, పేదలకు ఇండ్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. టిపిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి, సిఎల్‌పి నేతగా తాను ఇండ్లపై హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని, పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News