Sunday, January 12, 2025

దేశంలో ఇందిరమ్మ కాలనీ లేని ఊరే లేదు: రేవంత్

- Advertisement -
- Advertisement -

దరాబాద్: దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పది వేల రూపాయాలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామని, ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని, రోటీ, కపడా, ఔమర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం అని, ఇల్లు, వ్యవసాయ భూమిని ఆత్మగౌరవంగా భావిస్తారని, అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారని, అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

గతంలో కెసిఆర్ రద్దు చేసి గృహనిర్మాణశాఖను పునరుద్ధరించామన్నారు. రేపటి నుంచి తెలంగాణ వాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌజ్ ఉంటుందని, మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తామన్నారు. నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గ్రామ సభలో ఇందిరమ్మ కమిటీలు ద్వారా అర్హుల ఎంపిక చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News