Wednesday, January 22, 2025

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

- Advertisement -
- Advertisement -
  • మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి

ఫరూఖ్‌నగర్: వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని ఫరూఖ్‌నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొంగగూడ, వెంకన్నగూడ గ్రామాల్లో నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి తొమ్మిదేండ్ల పాలనలో సామాన్య ప్రజలను పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలో ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని, సామాన్యులపై ధరల భారం మోపారని మండిపడ్డారు. నిత్యవసరాల సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిల సారథ్యంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని, కేంద్ర, రాష్ట్రంలోని అధికార పార్టీల పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మనమంతా ఐక్యంగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని సూచించారు.

పార్టీలో చేరిన పలు తండాల గిరిజనులు

కాంగ్రెస్ పార్టీలో కొండన్నగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ గిరిజన తండాల నుంచి మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్, బిజెపిల విధానాలపై తీవ్ర అంసతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, త్వరలో మరిన్ని చేరికలు ఉండనున్నాయని తెలిపారు.

పేద ప్రజలకు అండ కాంగ్రెస్ జెండా పేదోడి నేస్తం కాంగ్రెస్ హస్తం అని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం తధ్యం అని ధీమా వ్యక్తం చేశారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు ఎంపిటిసి లక్ష్మమ్మ, నాయకులు రవీందర్‌నాయక్, వేణునాయక్, మేఘనాథ్, మహేష్, భరత్, రాంసింగ్, సుభాష్, దేవ్, శ్రీనివాస్‌రెడ్డి, రాజు, వెంకటేష్, మోహణ్, నాగేష్, గోపాల్, బాల్‌రెడ్డితోపాటు ఆయా గ్రామాల ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News