Thursday, January 23, 2025

ఇందిరానగర్ కాలనీపై పాలకులు, అధికారుల చిన్నచూపు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : కల్వకుర్తి పురపాలక పరిధిలోని ఇందిరానగర్ కాలనీపై పాలకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఇందిరానగర్ బిజెపి యువ నాయకుడు బాబిదేవ్ అన్నారు. గురువారం బాబిదేవ్‌తో పాటు పట్టణ బిజెపి నాయకులు ఇందిరానగర్ కాలనీలో పర్యటించి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురపాలక పరిధిలోని అన్ని వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, మంచి సిసి రోడ్డు నిర్మిస్తే ఇందిరానగర్ కాలనీలో మాత్రం పాత మోరీలనే మళ్లీ కడుతున్నారన్నారు.

సిసి రోడ్లను గాలికి వదిలేసారని, ఇందిరానగర్ కాలనీలో చాలా ఇండ్లకు సెప్టిక్ ట్యాంక్ లేవని పాత మోరీలకు డైరెక్టుగా పైపులు వేయడంతో డ్రైనేజీ నేరుగా ఓపెన్ మోరీలలోకి రావడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందన్నారు. గత 30 ఏళ్లుగా ఇదే సమస్యతో కాలనీ వాసులు రోగాలకు గురవుతూ బాధ పడుతున్నారని, ఓపెన్ మురుగు కాల్వ ఉండడం వలన మోరీలలోనే ప్రజలు చెత్తా చెదారం వేస్తున్నారని, దీని వల్ల దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, దుర్వాసన కారణంగా కాలనీవాసులు రోగాలకు గురవుతున్నారన్నారు.

ఇప్పుడు పట్టణం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేస్తుండడంతో ఇందిరానగర్ కాలనీకి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజి వస్తుందని ఆశతో ఉన్న మాకు మళ్లీ పాత మోరాలనే నిర్మించడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరానగర్ కాలనీలోని డ్రైనేజీలు అలాగే రోడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, దీనికి తోడు కాలనీలో జైలు, పెట్రోల్ బంక్ ఉండడం వల్ల నిత్యం వందలాది వాహనాలు వస్తుండడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ఇందిరానగర్ కమాన్ నుంచి రోడ్ నెం. 8 వరకు డబుల్ సిసి రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మొగిలి దుర్గా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు బాబిదేవ్, బూత్ అధ్యక్షులు రాజు యాదవ్, నాయకులు రవి సాగర్, దామచర్ల శేఖర్, లక్ష్మి నరసింహ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News