- Advertisement -
వాషింగ్టన్: నాసా నూతన చీఫ్ టెక్నాలజిస్ట్‌గా ఇండోఅమెరికన్ ఎయిరోస్పేస్ (అంతరిక్ష) పారిశ్రామిక నిపుణుడు ఎసి చరణియా నియామకమయ్యారు. నాసా నిర్వాహకుడు బిల్ నెల్సన్‌కు సాంకేతిక విధానం పైన, నాసా ప్రధాన కేంద్రంలో కార్యక్రమాలకు సంబంధించి ప్రధాన సలహాదారుగా చరణియా వ్యవహరిస్తారు. నాసాలో కొత్త ఉద్యోగంలో ఈ నెల 3న ఆయన చేరారు.
అంతవరకు తాత్కాలిక చీఫ్ టెక్నాలజిస్టుగా పనిచేసిన మరో ఇండో అమెరికన్ సైంటిస్టు భవ్యలాల్ స్థానంలో చరణియా వచ్చారు. నాసా సంస్థాగత సాంకేతిక పెట్టుబడులను ఆరు మిషన్ డైరెక్టరేట్లకు విస్తరింప చేయడమే కాక, ఇతర ఫెడరల్ ఏజెన్సీలతో విదేశీ సాంకేతిక సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రైవేట్ పరంగా బయటి భాగస్వాములతో అనుసంధానం చేస్తారని నాసా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.
- Advertisement -