Wednesday, January 22, 2025

అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత
పార్క్ వద్ద కారులో ఉండగా దారుణం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు. ఇక్కడి క్వీన్స్ ప్రాంతంలో ఈ 31 ఏండ్ల వ్యక్తి ఎస్‌యువి వాహనంలో కూర్చుని ఉండగా కాల్పులు జరిగాయి. కొద్దిరోజల క్రితమే భారతీయుడిని ఒకరిని మేరీల్యాండ్‌లో దుండగులు కాల్చిచంపారు.ఈ ఘటన తరువాత ఇప్పుడు న్యూయార్క్ సంఘటన జరిగింది. సౌత్ ఓజోన్ పార్క్ వద్ద సత్నామ్ సింగ్ అనే వ్యక్తి తన నల్లటి జీపు వ్రాంగ్లెర్ సహారాలో పార్క్ చేసుకుని ఉన్నప్పుడు సాయుధుడు ఆయన వద్దకు వచ్చి ఉన్నట్లుండి కాల్పులు జరిపినట్లు న్యూయార్క్ డెయిలీ న్యూస్ తెలిపింది. సింగ్ నివాసం ఘటనాస్థలికి కొద్ది దూరంలోనే ఉందని పోలీసులు తెలిపారు. దుండగుడు ఆయన ఛాతీ మెడపై గురి చూసి కాల్పులు జరిపాడు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స దశలో మృతి చెందినట్లు వెల్లడించారు. సత్నామ్‌సింగ్ తన స్నేహితుడి వద్ద నుంచి కారును కొద్ది సేపటి కోసం తీసుకుని వచ్చినట్లు వెల్లడైంది. సాయుధుడు సింగ్‌ను లక్షంగా చేసుకున్నాడా? లేక ఈ వాహనం యజమానిని టార్గెట్ చేసుకున్నాడా? అనేది తేల్చేందుకు డిటెక్టివ్‌లు రంగంలోకి దిగారు. కారులోపల ఎవరున్నది గమనించకుండానే ఆగంతకుడు కాల్పులకు దిగినట్లు పోలీసులు నిర్థారించారు. కాల్పులు జరిపింది ఎవరనేదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని అక్కడివారు కొందరు తెలిపారు. అయితే సింగ్ కారును దాటుకుంటూ వెళ్లిన ఓ సెడాన్ కారులో నుంచి కాల్పులు జరిగాయని మరికొందరు తెలిపారు.

Indo-American Shot dead in New York

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News