Thursday, December 26, 2024

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం ఎంతో అనుకూలంగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక, మత్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారెడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి తలసానిని సూర్య బెజవాడ ఆధ్వర్యంలో ఇండో కెనడా ఛాండర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వ పరంగా చేయూతను అందించి ప్రోత్సహించాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

మత్సకారుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా చేప పల్లిలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావంకు ముందు రాష్ట్రంలో సరైన నీరు, విద్యుత్ ఉండేది కాదని అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో కాళేశ్వరం వంటి నూతన సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల పెద్ద సంఖ్యలో నీటివనరులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి నీటి వనరులో చేపపిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని వివరించారు. పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని అన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి సురక్షితమైన త్రాగునీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, నూతన పరిశ్రమల ఏర్పాటుకు వాతావరణాన్ని అన్ని విధాలుగా సౌకర్యవంతంగా

ఉండటం వల్ల అనేక దేశాల నుండి వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెడుతున్నారని, తద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తితో ఉన్నట్లు మంత్రి వివరించారు. పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున ఆయన వచ్చిన అనంతరం ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రిని కలిసిన వారిలో ఇండో కెనడా కో ఆర్డినేటర్ త్రిభువన్ ఆనంద్, వికాస్ గుప్త, కల్పేష్ జ్యోషి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News