Friday, April 4, 2025

ఆర్థిక అంశాలపై మోడీ–కిషిదా చర్చలు

- Advertisement -
- Advertisement -

Modi-Kishida meeting

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యారు. జపాన్ ప్రధాని రెండు రోజల భారత పర్యటనపై వచ్చారు. ఆయన మోడీతో ద్వైపాక్షిక సమావేశంతో పాటు కీలక కార్యక్రమాలకు కూడా హాజరుకానున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే విషయాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. సమావేశంలో ఐదేళ్ల కాలంలో భారత్‌లో 42 బిలియన్ డాలర్ల పెట్టుబడిని కిషిదా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన 300 బిలియన్ యెన్ రుణాన్ని కూడా అంగీకరించనున్నారు. కాగా కర్బనం తగ్గింపుకు సంబంధించిన ఎనర్జీ సహకార పత్రంపై కూడా ఆయన సంతకం చేస్తారని తెలుస్తోంది. భారత్‌లో జపాన్ కంపెనీల విస్తరణను, ప్రత్యక్ష పెట్టుబడిని కూడా కిషిదా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇదిలావుండగా 14వ భారత్‌జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. అంతేకాక మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News