Wednesday, January 22, 2025

సమస్యల పరిష్కారంలో అలసత్వం సహించం

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్షం చేస్తే సహించేది లేదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను హెచ్చరించారు. కాచిగూడ డివిజన్‌లోని కుద్బిగూడ, మన్యార్ పట్టి లైన్, చప్పల్‌బజార్ పరిధిలో మంచినీటి సరఫరాలో లోప్రెషర్ సమస్య ఉందని, కొన్నిచోట్ల కలుషిత మంచినీటి సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేకు ఫిర్యాదుల వచ్చాయి. వెంటనే స్పందించిన ఎమ్మె ల్యే కాలేరు వెంకటేష్ మంగళవారం ఉదయం సంబంధిత అధికారులతో కాచిగూడ డివిజన్‌లోని వివిధ ప్రాంతా ల్లో పర్యటించారు.

ఉదయం నీటి సరఫరా జరిగే సమయంలో ఎమ్మెల్యే, వాటర్ వర్క్ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సమస్యల గురించి అక్కడి ప్రజలతో మాట్లాడి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సరఫరాలో తలెత్తుతున్న లో,ప్రెషర్, కలుషిత మంచి నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత జలమండలి అధికారులను ఆదేశి ంచారు. నియోజికవర్గం ఎదైన సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈకార్యక్రమం లో జల మండలి డిజిఎం సన్యాసిరావు, ఏఈ భావన, వర్క్ ఇన్‌స్పెక్టర్ మ హేష్, కా చిగూడ డివి జన్ అధ్యక్షుడు భీష్మ దేవ్, ప్రదాన కార్యద ర్శి సదా నంద్, మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, నాగేందర్ బాబ్జి, క్రాంతి, సతీ ష్, భాస్కర్, మహే ష్, సూర్యారావు, రాజేష్, ప్రకాష్‌యాదవ్, శివ గణేష్ స్థాని కులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News