Monday, December 23, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు

- Advertisement -
- Advertisement -

అల్వాల్ : మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రతి కాలనీకి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం అల్వాల్ డివిజన్లోని శ్రీ బేకరీ లైన్ లో తలెత్తుతున్న డ్రైనేజీ వ్యవస్థ పై ఆయన స్థానిక కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా భారతి నగర్, శ్రీనివాస్ నగర్ కాలనీవాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గతంతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించినప్పటికీ రోడ్ నెంబర్ 2 లో సమస్య ఇప్పటికీ కొంత అపరిస్కృతంగా ఉందని స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కల్పించడం, బాక్స్ డ్రాయిన్ నిర్మాణం వల్ల వరదనీటి సమస్య చాలా వరకు తగ్గిందని స్థానిక కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలిపారు.

రోడ్ నెంబర్ 2 తో పాటు గీతా స్కూల్ పక్కన ఉన్న పార్కు స్థలం సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ సమస్యలపై స్థానిక అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే బాక్స్ రేట్ నిర్మాణంలో వరదనీరు ప్రవాహం వర్షాల సమయంలో వచ్చే నీటి ప్రవాహం వల్ల కొంచెం లోతట్టుగా ఉన్న రోడ్ నెంబర్ 2 లో మీరు నిలవడం జరుగుతుందని ఆ సమస్య పరిష్కారానికి మార్గాలను సంబంధిత అధికారులు ఎమ్మెల్యే సూచించారు. ప్రజా సమస్యల పరిష్కరించడం లో అలసత్వం వహించరాదని ఎలాంటి సమస్యలు ఉన్నతను దృష్టికి తీసుకురావాలని స్థానికులను అధికారులను ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News