Wednesday, January 22, 2025

మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా బ్యూటీ..?

- Advertisement -
- Advertisement -

గుంటూరు కారం సినిమాతో అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన నెక్ట్స్ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్నారు. ఈ మూవీ పాన్ వరల్డ్ గా ఆఫ్రికన్ ఫారెస్టుల బ్యాక్ డ్రాప్ లో తెరెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్టుపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ హీరోయిన్ నే జక్కన్న తీసుకోబోతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. తాజాగా మహేష్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని రాజమౌళి దింపుతున్నట్లు ఓ వార్తా సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఇస్లాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్ స్టాలో రాజమౌళిని ఫాలో అవుతుందట. దీంతో ఈమెను మహేష్ కు జోడీగా నటించనుందనే వార్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిత్రయూనిట్ మాత్రం ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. హీరోయిన్ తోపాటు నటీనటులు వివరాలను వెల్లడించలేదు. త్వరలో రాజమౌళి ప్రెస్ మీట్ ద్వారా ఈ మూవీకి సంబంధించిన వివరాలను తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News