Thursday, November 21, 2024

ఇండోనేషియాలో వ్యాక్సినేషన్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జకార్తా: ఇండోనేషియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈమేరకు ప్రచారం పెంచడానికి అధ్యక్షుడు జోకో విడోడో బుధవారం తొలి వ్యాక్సిన్ వేయించుకున్నారు. చైనా వ్యాక్సిన్ సినోవాక్ బయోటెక్‌కు ఇండోనేషియాలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. అధ్యక్షుని తరువాత మిలిటరీ ఉన్నతాధికారులు, పోలీస్‌లు, ఆరోగ్యాధికారులు, వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. ఇండోనేషియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి వ్యాక్సిన్‌ను పొందిన తరువాత ముస్లింలు అందరూ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 6న సినోవాక్ తొలి రవాణా చేపట్టారు. అప్పటి నుంచి సాయుధ బలగాల నిఘాలో వ్యాక్సిన్‌ను భద్ర పరిచారు.

Indonesia begins Vaccination drive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News