Sunday, December 22, 2024

మసీదులో భారీ అగ్నిప్రమాదం.. కూలిన గోపురం.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

Indonesia Mosque Catches Massive Fire

జకార్తా: ఇండోనేషియాలోని జకార్తా ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో మసీదు పెద్ద గోపురం కూలిపోయింది. ఈ ఘటన కెమెరాకు చిక్కగా ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇస్లామిక్ సెంటర్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు మంటలు అంటుకోవడంతో కూలిపోయింది. వైరల్ వీడియోలో, కూలిపోయే ముందు మసీదు గోపురం నుండి మంటలు, పొగలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ మసీదు జకార్తా ఇస్లామిక్ సెంటర్‌కు చెందిన భవన సముదాయంలో ఉంది. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, మసీదును పునరుద్ధరించే పనిలో ఉన్న కాంట్రాక్టర్ కంపెనీకి చెందిన నలుగురు కార్మికులను విచారించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News