Monday, December 23, 2024

క్వార్టర్స్‌లో ప్రణయ్.. సింధు ఇంటికి

- Advertisement -
- Advertisement -

జకర్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు హెచ్ ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే మహిళల సింగిల్స్‌లో స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు ఓటమి పాలైంది. కాగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ షెట్టి జోడీ ప్రీక్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 2118, 2116 తేడాతో హాంకాంగ్‌కు చెందిన లాంగ్ అంగూస్‌ను ఓడించాడు.

ఆరంభం నుంచే ప్రణయ్ ఆధిపత్యం చెలాయించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 2117, 2220 తేడాతో భారత్‌కే చెందిన లక్షసేన్‌ను ఓడించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో మ్యాచ్‌లో భారత ఆటగాడు ప్రియంశు రజావత్ ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో అగ్రశ్రేణి షట్లర్ సింధుకు చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తైవాన్ షట్లర్ తైజు ఇంగ్ చేతిలో సింధు కంగుతిన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News