Monday, December 23, 2024

ఇండోనేసియా ఓపెన్: సెమీ ఫైనల్లో ప్రణయ్

- Advertisement -
- Advertisement -

Indonesia Open: Pranay in the semi-finals

 

జకార్తా: భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో ప్రణయ్ 2114, 2112 తేడాతో డెన్మార్క్ ఆటగాడు రస్ముస్ గెమ్కేను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ప్రణయ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ప్రణయ్ ధాటికి గెమ్కే ఎదురు నిలువలేక పోయాడు. తన మార్క్ షాట్లతో అలరించిన ప్రణయ్ లక్షం దిశగా దూసుకెళ్లాడు. ప్రణయ్‌కు కనీస పోటీ ఇవ్వడంలో గెమ్కే విఫలమయ్యాడు. అద్భుత ఆటను కనబరిచిన ప్రణయ్ అలవోకగా తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండో సెట్‌లో ప్రణయ్ మరింత దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. మరోవైపు తీవ్ర ఒత్తిడికి గురైన గెమ్కే వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్రణయ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించాడు. ఇక శనివారం జరిగే సెమీస్‌లో చైనా షట్లర్ జున్ పెంగ్‌తో ప్రణయ్ తలపడుతాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News