Monday, January 20, 2025

ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

జకార్త: ఇండోనేషియాలో ప్రధాన దీవి జావాలో శుక్రవారం రెండు రైళ్లు ఢీఒకన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో అనేక బోగీలు పట్టాలు తప్పి బోల్తాపడ్డాయి. పశ్చిమ జావాలోని బండుంగ్ నగరంలో సికాలెంక రైల్వే స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ రైల్వేలైన పిటి కేరెట అపి ఇండోనేషియా ప్రతినిధి అయెప్ హనపి తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఇండోనేషియాలో రైలు ప్రమాదాలు సర్వసాధారణం. పురాతనమైన రైల్‌రోడ్డు వ్యవస్థలో ముఖ్యంగా క్రాసింగుల వద్ద ప్రమాదాలు తరచు జరుగుతుంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News