జకర్తా(ఇండోనేషియా): ఒక వ్యక్తి వానలో రోడ్డుపై నింపాదిగా నడుచుకుంటూ వెళ్లాడు. ఉన్నపళంగా పిడుగు అతడిపై పడింది. దాంతో క్షణాల్లోనే కుప్పకూలి పడిపోయాడు. వృత్తిరీత్యా అతడో సెక్యూరిటీ గార్డు. గత వారం ప్రారంభంలో ఉద్యోగంలో ఉండగా అతని గొడుగుపై పిడుగు పడింది. ఆ దృశ్యం నిఘా కెమెరాలో చిక్కుకుంది. గార్డు గొడుగు పట్టుకుని పార్కింగ్ స్థలంలో వర్షంలో తడుస్తున్నట్లు కనిపించాడు. సమీపంలో భారీ ట్రక్కులతో ఫ్యాక్టరీ పార్కింగ్ లాగా కనిపించింది.
అతను నడుస్తూ ఉండగా, అతని గొడుగు నుండి భారీ నిప్పురవ్వలు వెలువడటం కనిపించింది, అతను పిడుగు దెబ్బ తిన్నాడు. కదలకుండా నేలపై పడిపోవడం భయానకంగా కనిపించింది. అదృష్టవశాత్తూ సమీపంలోని ఇతర సహచరులు అతనిని కాపాడడానికి పరుగెత్తుకెళ్లారు.
ఉత్తర జకార్తాలోని సముద్రతీర పట్టణం సిలిన్సింగ్‌లో వర్షపు ప్రాంగణంలో పెట్రోలింగ్ చేస్తున్న ఆ వ్యక్తిని అబ్దుల్ రషీద్‌గా స్థానిక మీడియా గుర్తించింది. నేరుగా మెరుపు దాడిని ఎదుర్కొన్నప్పటికీ, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని చేతికి మాత్రమే కాలిన గాయమైంది. నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత అతను స్థానిక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని సిలింసింగ్ పోలీస్ కమిషనర్ ఆర్. మనురుంగ్ తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియో క్లిపింగ్‌లో ఏమి జరిగిందో మీరే చూడండి.
Lightning strikes a man while he was working during bad weather. #Lightning #thunderstorms pic.twitter.com/6eAkff68Y2
— News18 (@CNNnews18) June 12, 2022