- Advertisement -
జకర్తా : అదృశ్యమైన సబ్‌మెరైన్ బీటలు వారి సముద్ర జలాల్లో మునిగిపోవడంతో అందులోని 53 సిబ్బంది జలసమాధి అయ్యారని ఇండోనేసియా నేవీ శనివారం ప్రకటించింది. గత రెండు రోజులుగా సబ్‌మెరైన్ కోసం గాలింపు జరిగింది. అందులోని కొన్ని భాగాలు కనిపించాయి. బాలి ద్వీపం వద్ద బుధవారం సబ్‌మెరైన్ కెఆర్‌ఐ నంగాలా 402 ఆఖరిసారి కనిపించిందని, ఆ తరువాత అదృశ్యమైందని మిలిటరీ చీఫ్ హాడి జహజాంటో చెప్పారు. ఆ ప్రదేశంలో కనిపించిన చమురు జాడలు, శిధిలాలు బట్టి సబ్‌మెరైన్ మునిగిపోయందని రూఢి అయిందని తెలిపారు. సబ్‌మెరైన్ పేలి ఉంటే తునకలు కనిపించేవని, అలా కాకుండా సబ్‌మెరైన్ లోని కొన్ని భాగాల్లో బీటలు వారడంతో క్రమంగా ఆ భాగాలు దాదాపు 500 మీటర్ల లోతుకు చేరుకున్నాయని నేవీ చీఫ్ యుడో మార్గొనో పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు.
- Advertisement -