- Advertisement -
పెద్ద ఎత్తున విరజిమ్మిన బూడిద, పొగలు
మెడన్(ఇండోనేషియా): ఇండోనేషియాలోని సుమత్ర దీవులలోబుధవారం ఒక అగ్నిపర్వతం బద్దలై పెద్ద ఎత్తున బూడిద, వేడివేడి పొగలు వెలువడ్డాయి. ఉత్తర సుమత్ర ప్రావిన్సులోని సినాబంగ్ పర్వతం నుంచి వెలువడిన బూడిద 4,500 మీటర్ల(14,760 అడుగుల) ఎత్తున ఆకాశంలోకి ఎగశాయని, దట్టమైన వేడి పొగలు ఒక కిలోమీటరు దూరం వరకు విస్తరించాయని ఇండోనేషియా అగ్నిపర్వత, భౌగోళిక ప్రమాద అధ్యయన కేంద్రం తెలిపింది. ఈ అగ్నిపర్వత పేలుడు కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు. 2,600 మీటర్ల(8,530 అడుగుల) ఎత్తయిన ఈ పర్వతం గడచిన ఏడాది కాలంగా నిప్పులు రాజుకుంటూనే ఉంది. సమీపంలోని గ్రామస్తులను 5 కిలోమీటర్ల దూరానికి అధికారులు తరలించివేశారు. ఈ ఏడాది మే నెలలో ఇదే అగ్నిపర్వతం మొదటిసారి బద్దలై సమీప గ్రామాలపై బూడిద విరజిమ్మింది.
- Advertisement -