Monday, December 23, 2024

మార్క్ షీట్ ఇవ్వనందుకు ప్రిన్సిపాల్‌కు నిప్పంటించాడు

- Advertisement -
- Advertisement -

ఇండోర్(మధ్యప్రదేశ్): మార్క్ షీట్ ఇవ్వడంలో జాప్యం జరిగిందన్న కోపంతో ఒక పూర్వ విద్యార్థి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన 54 ఏళ్ల ప్రైవేట్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ శనివారం ఆసుపత్రిలో పోలీసులు తెలిపారు. ఇండోర్‌లోని సిమ్రోల్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విముక్త శర్మపై గత సోమవారం అశుతోష్ శ్రీవాస్తవ(24) అనే పూర్వ విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఎస్‌పి భగవత్ సింగ్ విర్దే తెలిపారు.

మార్కుల షీట్‌ను ఇవ్వడంలో జాప్యం చేసినందుకు అతను ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఆయన చెప్పారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రిన్సిపాల్‌ను కాపాడలేకపోయారని ఆయన చెప్పారు. నిందితుడిని సోమవారం అరెస్టు చేసి పోలీసు కస్టడీలో ఉంచినట్లు ఎస్‌పి చెప్పారు. నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఎ)ను జిల్లా యంత్రాంగం అమలు చేసినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News