Tuesday, November 5, 2024

దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా ఏడవసారి ఇండోర్

- Advertisement -
- Advertisement -

రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ముంబై

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని సూరత్ నగరాలు అవార్డులను దక్కించుకున్నాయి. మూడవ స్థానంలో ముంబై మరోసారి నిలిచింది. దేశంలోని పరిశుభ్రమైన నగరాలపై జరిపే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ఫలితాలను గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023 సంవత్సారానికి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలోని ఉత్తమ పనితీరును కనబరిచిన రాష్ట్రాలలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి.

కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతరుల హాజరైన ఒక కార్యక్రమంలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ వరుసగా ఏడవసారి అవార్డును సొంతం చేసుకుంది. ఒక లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న పరిశుభ్ర నగరాలలో మహారాష్ట్రలోని సస్వద్‌కు మొదటి స్థానం దక్కింది. ఈ విభాగంలో రెండవ స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లోని పటన్, మూడవ స్థానంలో మహారాష్ట్రలోని లోనావాలా నిలిచాయి.

ఉత్తమ పరిశుభ్ర గంగా పట్టణంగా వారణాసి అవార్డును గెలుచుకోగా తరువాతి స్థానంలో ప్రయాగ్‌రాజ్ నిలిచింది. పరిశుభ్రమైన కంగోన్మెంట్ బోర్డుల విభాగంలో మొదటి ర్యాంకు మధ్యప్రదేశ్‌లోని మో కంటోన్మెంట్ బోర్డుకు మొదటి ర్యాంకు దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్, 2023 సర్వేలో 4,447 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద పరిశుభ్రతకు సంబంధించిన సర్వేగా ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News