Sunday, December 22, 2024

కోవిడ్ జవాబు 40వేల పేజీలలో..

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలో ఓ ప్రశ్నకు 40,000 పేజీల సమాధానం పొందారు. ఇండోర్‌కు చెందిన ధర్మేంద్ర కోవిడ్ 19 గురించి తాను అడిగిన ప్రశ్నకు ఈ భారీ సమాధానం రాబట్టుకున్నారు. ఆర్టీఐ కార్యాలయం నుంచి ఈ పత్రాలను ఆయన తన ఇంటికి భారీ స్పోర్ట్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యువి)లో తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఇండోర్‌లోని వైద్య ప్రధానాధికారి నుంచి ఈ వ్యకి కోవిడ్ సంబంధిత బిల్లులు , టెండర్లు ఇతర వివరాలను ఆర్టీఐ పరిధిలో కోరాడు.

అప్పటి దశలో ఎంత ఖర్చు అయింది? ఏఏ సంస్థకు ఎంత డబ్బు అందింది? అనే వివరాలను ఆయనకు ఈ పత్రాలలో పొందుపర్చి పంపించారు. నెలరోజుల వ్యవధిలోనే ఈ సమాచారం అందించాల్సి ఉంది. అయితే పద్థతి ప్రకారం దీనిని సమకూర్చలేకపోవడంతో ఇప్పుడు ఈ పత్రాలను ఉచితంగా అధికారులు సమకూర్చారు. సాధారణంగా ఆర్టీఐ పరిధిలో వెలువరించే జవాబులకు ప్రతి పేజీకి రూ రెండు చొప్పున అర్జీదారు చెల్లించాల్సి ఉంటుంది. తాను ఈ విధంగా రూ 80 వేల భారం నుంచి తప్పించుకున్నానని , మొత్తం ఎస్‌యువి భర్తీ చేసుకుని ఇంటికి వెళ్లానని శుక్లా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News