Monday, December 23, 2024

ఇండియాకు బదులుగా భారత్: ఇండోర్ మేయర్ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ఇండోర్: అధికారిక  ఉత్సవాలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో ఇండియా స్థానంలో భారత్ అని వ్యవహరించాలన్న ప్రతిపాదనకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆమోదం తెలిపారు.

ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మేయర్ పుష్యమిత్ర భార్గ శనివారం నిర్వహించిన ఒక సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. దీన్ని వచ్చే నెలలో సమావేశం కానున్న 85 మంది సభ్యుల కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు శనివారం తెలిపారు.

ఇండియా అన్న పేరు బ్రిటిష్ పాలకులు మనకు ఇచ్చిన బహమానమని, కాని భారత్ అన్న పేరు మన ఘన చరిత్రను, సాసృ్ంకతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని మేయర్ భార్గవ తెలిపారు. మన రాజ్యాంగం ప్రకారం మన దేశం పేరు భారత్ మాత్రమేనంటూ ఆయన తెలిపారు.

గత కొద్ది వారాలుగా ఇండియా రాజ్యాంగలో 4వ అధికరణ నుంచి ఇండియా పేరును తొలగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News