Sunday, January 19, 2025

బిజెపి స్టీరింగ్ అదానీ చేతుల్లో ఉంది: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణల పట్ల అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాకు ఇంద్రకరణ్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు.  అమిత్ షా మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా నిజం లేదని ధ్వ‌జ‌మెత్తారు. బిజెపి ప్ర‌భుత్వానిది ‘డబుల్ ఇంజిన్’’ కాదని ‘ట్రబుల్ ఇంజిన్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ ప్ర‌జ‌లు బిజెపికి క‌ర్రు కాల్చి వాత పెట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. కారు స్టీరింగ్ కెసిఆర్ చేతుల్లో ప‌దిలంగా ఉందని, బిజెపి స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని చురకలంటించారు.

బిజెపోళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని, అమిత్‌ షా తెలంగాణ‌కు ఎప్పుడొచ్చినా అడ్డగోలుగా మాట్లాడుతారని, నోటికొచ్చిన ఆరోపణలు చేసి పోతారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర‌ అభివృద్ధిపై ఆయనకు కొంచమైన అవగాహన ఉందా?. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా?’’ అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందని ఆయన హితవు పలికారు. రైతు ఆత్మ‌హ‌త్య‌లు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హ‌త అమిత్ షాకు లేద‌ని విమర్శించారు. బిజెపిది రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మ‌ని, బిజెపోళ్లా తెలంగాణకు నీతులు చెప్పే అవసరం లేదని చురకలంటించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల‌కు జాతీయ హోదా, ఆదిలాబాద్ లో సిసిఐ పున‌రుద్ధ‌ర‌ణ‌పై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్ తో మాట్లాడాలని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అమిత్ షా.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత తొమ్మిదిన్న‌ర ఏళ్లుగా తెలంగాణ‌కు బిజెపి కేంద్ర ప్ర‌భుత్వం చేసిందేమి లేద‌ని మండిప‌డ్డారు.

రాజకీయ లబ్ధి పొందాలనే బిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. తెలంగాణ‌కు నిధులు ఇస్తామ‌ని, సిసిఐని పున‌రుద్ద‌రిస్తామ‌ని ఏవైనా హ‌మీలు ఇస్తార‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఆశించార‌ని, కానీ రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయడం మంచిది కాదని ఇంద్రకరణ్ రెడ్డి హితువు పలికారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న వ‌ల్ల‌ తెలంగాణ‌కు ఒరిగిందేమి లేద‌ని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News