Thursday, January 23, 2025

ఢిల్లీకి చేరుకున్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న న్యాయ స‌ద‌స్సులో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన‌నున్నారు. సిజెఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్ర స్ట్రక్చర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించ‌నున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News