Tuesday, December 24, 2024

ఆగస్టు 22న ఇంద్ర రీరిలీజ్.. అన్ని షోలు ఫుల్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఆన్ లైన్ టికెట్లు బుక్ మై షోలో పెట్టేశారు. ఇప్పటికే టికెట్స్ అన్ని సోల్డ్ ఔట్ అయ్యాయని వైజయంతి మూవీస్ తాజాగా పోస్టర్ విడుదల చేసింది. కాగా, డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా చిరు కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

2002 జులై 24న విడుదలైన ఈ సినిమాలో ఇంద్రసేనారెడ్డి, శంకరానారాయణగా చిరు డబుల్ రోల్ లో నటించారు. చిరుకు జోడీగా ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే నటించారు. ఇక, ఇందులో చిరు డ్యాన్స్, డైలాగ్స్ ఇప్పటికీ అలరిస్తుంటాయి. అప్పట్లో ఈ సినిమా కలెక్షన్ల రికార్డు సృష్టించింది. మరోసారి అలరించేందుకు ఇంద్ర సిద్ధమైంది. అల్రేడీ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా స్టార్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News