Monday, December 23, 2024

ప్రధాని వ్యాఖ్యలుకు నిరసగా ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ..

- Advertisement -
- Advertisement -

Kohli and Pant dismissed by Odean Smith

నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప‌ట్ల బీజేపీ వైఖ‌రిని నిర‌సిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం బీజేపీ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు. ”తెలంగాణ కోసం ఎంతో మంది బ‌లిదానాలు చేశారు. పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోడీ తెలంగాణ అమ‌ర‌వీరులు బ‌లిదానాల‌ను అప‌హాస్యం చేశారు. భేష‌ర‌తుగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మోడీ క్ష‌మాప‌ణ చెప్పాలి. బీజేపీ కుట్ర‌ల‌ను తెలంగాణ స‌మాజం తిప్పి కొట్టాలి. తెలంగాణ‌కు వ్య‌తిరేఖంగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఖ‌బార్ధార్ మోడీ. మ‌త‌త‌త్వ బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌లు అపప్ర‌మ‌త్తంగా ఉండాలి. తెలంగాణ‌లో మోడీ అండ్ కంప‌నీ ఆట‌లు సాగ‌వు. క‌ర్నాట‌క‌లో మ‌త విద్వేషాల‌కు బీజేపీయే కార‌ణం” అని ఆగ్రహం వ్యక్తిం చేశారు.

Indrakaran Reddy bike rally against PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News