Monday, December 23, 2024

పోలియో రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి..

- Advertisement -
- Advertisement -

Indrakaran Reddy Launches Pulse Polio Drive in Nirmal

నిర్మల్: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోలియో నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్ డే సంద‌ర్భంగా ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని నిర్మల్ పట్టణంలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కేంద్రంలో చిన్నారుల‌కు మంత్రి పోలియో చుక్క‌ల‌ను వేశారు. ప్ర‌తి చిన్నారికి పోలియో చుక్క‌లు వేయించి, పోలియో బారిన పడకుండా కాపాడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు వైద్యా రోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ సెంటర్లు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, లైబ్రరీలు, బస్టాండ్లు, ఎయిర్‌ పోర్టులు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Indrakaran Reddy Launches Pulse Polio Drive in Nirmal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News