Wednesday, January 22, 2025

కేంద్రం దిగోచ్చేదాక పోరాటం ఆగదు..

- Advertisement -
- Advertisement -

Indrakaran Reddy protest against Centre on Paddy

నిర్మ‌ల్: రాష్ట్రంలోని వ‌రి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కొట్లాడుతామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో యాసంగిలో పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ త‌ర‌హాలో కేంద్ర ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ బుధ‌వారం నాగ్ పూర్ జాతీయ ర‌హదారిపై క‌డ్తాల్ జంక్ష‌న్ వ‌ద్ద రైతులు, టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిదులు, కార్య‌క‌ర్త‌లు రాస్తారోకో నిర్వ‌హించారు. జాతీయ ర‌హ‌దారిపై బైటాయించి రైతుల‌ను అరిగోస పెడుతున్న కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ప‌క్ష‌నా ద‌ర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. వ‌రి ధాన్యం కొనుగోళ్ళ‌లో కేంద్ర వైఖ‌రిని నిర‌స‌న‌గా వ‌రి గొలుసుల‌ను ప్ర‌ద‌ర్శించి, నాగ‌లి ప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా తెలంగాణ రైతుల ప‌క్ష‌నా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పోరాటం చేస్తుంద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామ‌ని తెలిపారు. బాజాప్తా వరి వేయండి. మీ వడ్లను మేం కొనిపిస్తామ‌న్న బీజేపీ నాయ‌కులు తీరా పంట చేతికి వ‌చ్చాకా మోహం చాటేస్తున్నారని బీజేపీ తీరును త‌ప్పుప‌ట్టారు. ఇంత మండుటెండలో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిరైతుల ప‌క్ష‌నా ద‌ర్నా చేస్తున్నార‌ని, ఇక‌నైనా కేంద్ర బీజేపీ స‌ర్కార్ బుద్ధి తెచ్చుకుని క‌ళ్ళు తెర‌వాల‌ని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర బీజేపీ నాయ‌కులు తెలంగాణ రైతాంగానికి క్ష‌మాప‌ణ చెప్పి, వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. జాతీయ ర‌హ‌దారిపై బైటాయించి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెట్టాల‌నే ఉద్దేశ్యం టీఆర్ఎస్ కు లేద‌ని, ఇలాంటి నిర‌స‌న కార్యాక్ర‌మాల‌తోనైనా ఢీల్లీ స‌ర్కారుకు సెగ త‌గులుతుంద‌ని ఈ కార్య‌క్రమం చేప‌ట్టామ‌న్నారు.

Indrakaran Reddy protest against Centre on Paddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News