నాందేడ్: భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న పథకాలన్ని దేశమంతటా అమలవుతాయని తెలిపారు. బిఆర్‌ఎస్ పా ర్టీ విస్తరణలో భాగంగా గురువారం మంత్రి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గంలోని కిని గ్రా మంలో పర్యటించారు. రైతులు, వివిధ వర్గా ల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అ ల్లోల మాట్లాడుతూ కెసిఆర్ తెలంగాణను అనతికాలంలోనే కనీవిని ఎరుగనిరీతిలో అభివృద్ధి చేశారని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని, దేశ ప్రజలందరికీ ఈ పథకాలు అమలుచేసి అన్నిరంగాల్లో భారత దేశాన్ని అభివృద్ధి పరచాలని కెసిఆర్ బిఆర్‌ఎస్ పార్టీని స్థాపించారన్నారు.
సిఎం కెసిఆర్ త్వరలోనే నాందేడ్ జిల్లాలో పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నామని, రైతు మరణించిన.. ఆ కుటుంబానికి రూ.5లక్షల రైతుబీమా పరిహారం అందుతున్నదని వివరించారు. రైతులకు 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తాగునీరు, సాగునీరు, ఆసరా పించన్లు, కళ్యాణలక్ష్మి, దళితబంధు, కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్యం లాంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వారికి వివరించారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తున్నదని, ఐటి, ఫార్మా ఇలా అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్‌కు బిఆర్‌ఎస్, దాని మిత్రపక్షాలే ప్రత్యామ్నాయమన్నారు.
బిజెపి, కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు బిఆర్‌ఎస్ తరహా పాలన కోరుకుంటున్నారన్నారు. దేశంలో పుష్కలంగా సహజ వనరులు ఉన్నప్పటికీ అనుకున్నస్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు. కేంద్రంలోని బిజెపి పాలనకు చరమగీతం పాడాలని ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఊరూరా బిఆర్‌ఎస్‌ను విస్తరిస్తామని, త్వరలో ప్రతీ జిల్లాలో తాలూకా, గ్రామస్థాయి వరకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కూడా బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించి, ఆదరించాలని కోరారు. అంతకుముందు మంత్రి పాలజ్ కర్ర వినాయకుడిని దర్శించుకున్నారు. కాగా, నాందేడ్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు రమేష్ రాథోడ్, సునీల్ కుమార్ బజాజ్, ఆశోక్ రాథోడ్, వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ఈ సందర్భంగా బిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. మంత్రి వెంట ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిదులు ఉన్నారు.