గరిటే తిప్పుతూ గత స్మృతులను నెమరువేసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకణ్ రెడ్డి
ఆటవిడుపుగా మునుగోడు ప్రచారంలో వంట చేసిన మంత్రి అల్లోల
ఎంపిగా ఉన్న సమయంలో ఢిల్లీలో స్వయంపాక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మంత్రి
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజీబీజీగా ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గరిటే తిప్పుతూ గత స్మృతులను నెమరువేసుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేల్ గ్రామంలో నిర్మల్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల విడిది గృహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళారు. అయితే అక్కడ వంట చేస్తున్న నిర్మల్ నాయకులను మంత్రి చూశారు. తాను ఎంపిగా ఉన్న సమయంలో స్వయంగా వంట చేసుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. గరిటే తిప్పుతూ.. గత కాలం జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉదయం టీ నుంచి మొదలు రాత్రి భోజనం వరకు వంట చేసుకుని తిన్న సంగతులను, పార్లమెంట్ క్యాంటీన్ నుంచి పెరుగు తెచ్చుకుని అన్నం తిన్న రోజులను వారితో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి