Monday, December 23, 2024

ఆరేళ్ల తర్వాత బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణి ముఖర్జీ

- Advertisement -
- Advertisement -

 

Indrani Mukerjee realeased on bail

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ ఆరేళ్ల తర్వాత నేడు బైకులా జైలు నుంచి విడుదలయింది. ప్రత్యేక సిబిై కోర్టు ఆమెకు రూ. 2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ను మంజూరు చేసింది. బైకులా జైలు నుంచి బయటికి వచ్చిన ఆమె ‘నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ ముఖర్జీ ఇన్నాళ్లు ముంబయి లోని బైకుల్లా జైలులో గడిపారు.

2012లో షీనా బోరా హత్య  జరిగింది. షీనాకు తన మొదటి భర్త పీటర్ ముఖర్జీ కుమారుడైన రాహుల్ ముఖర్జీతో సంబంధం పెట్టుకోవడం నచ్చక షీనాముఖర్జీ ఆమెను గొంతు నులిమి చంపేసిందని, ఇందుకు ఆమె రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్‌రాయ్ సాయపడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలోదహనం చేసినట్లు కూడా తేలింది. డ్రైవర్ వాంగ్మూలం ఆధారంగా సగం కాలిన షీనామృతదేహాన్ని అడవిలో సమీపంలో తవ్వి వెలికి తీశారు. ఇంద్రాణీ ముఖర్జీని అరెస్టు చేసిన మూడు నెలల తర్వాత ఈ హత్యలో ఆమెకు సహకరించారన్న ఆరోపణపై ఆమె మాజీ భర్త పీటర్ ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. జైల్లో ఉండగానే ఇంద్రాణీ, పీటర్ ముఖర్జీలు తమ 17 ఏళ్ల వైవాహిక సంబంధానికి స్వస్తి చెప్పారు. 2019లో ఆ ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. అనంతరం పీటర్ ముఖర్జీ బెయిల్‌పై విడుదల కాగా ఇంద్రాణీ మాత్రం ఇన్నాళ్లు జైల్లోనే ఉంది. ఇదివరలో తన కుమార్తె బతికే ఉందంటూ షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ సిబిఐకి  లేఖ రాసింది. దానిపై దర్యాప్తు జరపాలని కూడా ఆమె సిబిఐని కోరింది. జైల్లో ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని, షీనా బోరాను తాను కశ్మీర్‌లో చూశానని ఆమె తనకు చెప్పిందని ఇంద్రాణి ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. షీనా కోసం కశ్మీర్‌లో గాలించాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరినట్లు ఆ కథనాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News