హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబస్ దాస్‌ను ఒడిశా గవర్నర్లుగా నియమించింది. ఇంద్రాసేనా రెడ్డి కమలం పార్టీలో ఆయన గత రెండు దశబ్దాల పాటు సేవలందించారు. మూడు పర్యాయాలు మల క్‌పేట ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన, నల్లగొండ పార్లమెంటు స్ధానం నుంచి పలుమార్లు పోటీ చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షునిగా పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఇంద్రసేనా రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలకంగా పనిచేశారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీని బలోపేతం కోసం శ్రమించారు. ఆయన సేవలు గుర్తించి భారతీయ జనతా పార్టీ త్రిపుర గవర్నర్‌గా అవకాశం కల్పించింది. ఆయన ఎంపిక పట్ల రాష్ట్ర బిజెపి నా యకులు హర్షం వ్యక్తం చేశారు.
త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -