Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో అతిపెద్ద ఎఫ్ అండ్ బి ట్రేడ్‌షో ఇండస్‌ఫుడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దక్షిణాసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎఫ్ అండ్ బి ట్రేడ్ షో ఇండస్‌ఫుడ్ హైదరాబాద్‌కు వచ్చింది. తెలంగాణలో మొదటి సారి, దేశంలో వరుసగా ఆరో సారి నినిర్వహిస్తోంది. ఈ ప్రదర్శన జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు హైటెక్స్‌లో జరగనుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎఫ్ అండ్ బి పరిశ్రమ ప్రముఖులు ఈ షోలో పాల్గొననున్నారు. ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టిపిసిఐ) ఈ ప్రదర్శనను నిర్వహిస్తోంది.

ఈ ప్రదర్శనలో 80కి పైగా దేశాల నుండి 1,200 ప్రపంచ స్థాయి కొనుగోలుదారులు 550కి పైగా భారతీయ ఎగ్జిబిటర్‌లతో చర్చలు జరుపనున్నారు. మూడు రోజుల ఈవెంట్‌లో మొత్తం వ్యాపార ఒప్పందాల విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా ఉండనుంది. ఈ కార్యక్రమం గురించి టిపిసిఐ వ్యవస్థాపక చైర్మన్ మోహిత్ సింగ్లా మాట్లాడుతూ, ఇండస్‌ఫుడ్ అంతర్జాతీయ మార్కెట్‌లో దాని పరిధులను విస్తరించడానికి భారతీయ ఎఫ్ అండ్ బి పరిశ్రమకు వేదికను అందిస్తోందని అన్నారు. గత ఐదేళ్లలో ప్రపంచ కొనుగోలుదారులతో ప్రత్యక్ష సంబంధాలను నిర్ధారించడం ద్వారా భారతదేశం ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతులలో వృద్ధికి ఇది ఉత్ప్రేరకంగా మారింది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News