ఎల్బీనగర్ : తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి ,దేశంలో హైదరాబాద్ ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ పారిశ్రామిక వాడలో రంగారెడ్డి ఇండస్ట్రీయల్ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన ‘ పారిశ్రామిక ప్రగతి ’ ఉత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఆటోనగర్‌లో తాగునీటీ సౌకర్యం,రోడ్లు నిర్మాణం చేపడతానని తెలిపారు.
ఎక్స్‌ప్రెస్ పనుల్లో ఆటోనగర్‌లోకి లారీలు సాఫిగా వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొమ్మిది సంవత్సరాలలో పారిశ్రామిక రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో టిఎస్ ఐ పాస్ ఏర్పాటు చేయడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడిందన్నారు. ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థ్దలకు సంబంధించిన యాజమానులను కలసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారన్నారు.
పలు పరిశ్రమలు స్థ్దాపించడంతో తెలంగాణలో ఉపాధి ,ఉద్యోగవకాశాలు పెరిగాయన్నారు. టిఎస్ ఐఐసీ ప్రాజెక్టు ఇంజనీర్ భరత్‌రెడ్డి ,అసిస్టేంట్ డైరక్టర్ అజయ్‌పాల్ ,అసిస్టేంట్ లేబర్ అధికారిని ప్రసన్న ,ఐలా మే నేజర్ రామకృష్ణ ,సిబ్బంది , ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా ,కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మరెడ్డి ,భారాస నాయకులు లింగాల రాహుల్ గౌడ్ ,అరవింద్‌రెడ్డి ,రాజిరెడ్డి ,నల్ల రఘుమారెడ్డి ,కృష్ణామాచారి ,టంగుటూరి నాగరాజు ,జక్కడి రఘువీర్‌రెడ్డి ,జగదీష్ గౌడ్ ,ముద్ద కళ్యాణ్ ,అసోషియషన్ సభ్యులు మదన్ మోహన్ ,విజయేందర్‌రెడ్డి ,శ్రీనివాస్ బాబు ,శేషు ,ఉస్మాన్‌పాష ,అంజనేయులు ,కలీమ్‌లు పాల్గొన్నారు.