Saturday, November 16, 2024

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం నాడు 174… నేడు 2518 పరిశ్రమలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటు

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి. వాటిలో ముఖ్యంగా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు టిఎస్ ఐ పాస్‌ను 2014లో అమలు చేయడంతో పరిశ్రమలు ఏర్పాటుకు సులభతర విధానంలో అనుమతులు లభించడంతో భారీ ఎత్తును పరిశ్రమలు ఏర్పటు కావడంతో పారిశ్రామిక ప్రగతి సాధ్యపడింది. టిఎస్ ఐ పాస్ ఏర్పాటుతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనలో పరిపాలాన భారం చాలావరకు తగ్గడమే కాకుండా దీని ప్రకారం అన్ని ప్రాజెక్టులకు 30 రోజులవ్యవధిలో అనుమతులు లభిస్తాయి. ఒక వేళ అనుమతి లభించక పోతే 31వ రోజు అనుమతి లభించినట్లే. ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ ప్రకారం ఇది దేశవ్యాప్తంగా అతి తక్కువ వ్యవధిలో గుర్తించబడి సంస్థగా పేరు పొందింది.

పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రం ఇచ్చిన“ క్లియరెన్స్ హక్కు”ను అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఎంతోకీలకంగా మారినట్లు పేర్కొంది. 2016 నుంచి పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం ( డిపిఐఐటి) ద్వారా సంకలనం చేయబడిన ఈజ్ ఆఫ్‌డూయింగ్ బిజినెస్ (ఈవోడిబి)లోతెలంగాణ ఉన్నత ర్యాకింగ్‌తో కీలక పాత్ర పోషించింది.టిఎస్ ఐ పాస్ ద్వారా ప్రభుత్వం 202223 ( జనవరి 2023) నాటికి రూ. 20, 237 కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించడం ద్వారా 2518 కొత్త పరిశ్రమల ఏర్పాటు చేసింది. టిఎస్ ఐ పాస్ ద్వారా 201516 , 202223 మధ్యకాలంలో పుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో పరిశ్రమలకు ఇచ్చిన అనుమతుల సంఖ్యలో నిర్దిష్టమైన పెరుగుదల నమోదైంది. ఈ సమయంలోనే 8.3 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ది రేటు ( సిఏజిఆర్)ను సాధించిందని, ఇది రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణ ఆహార విధానం( తెలగాణ ఫుడ్‌పాలసీ)ని ప్రతిభింప చేస్తుంది.

సిమెంట్, ఉత్పత్తుల మొత్తం రాబడిలో వాటా ఆకర్షణీయంగా పెరుగుతోందని, 2015 16లో మొత్తం పెట్టుబడుల్లో 0. 4 శాతం నుంచి 202223 నాటికి 10. 3 శాతానికి చేరుకుంది ప్లాస్టిక్, రబ్బర్ ఉత్పత్తులు 202223లో 17.8 శాతం ఉండగా, ఇది 2015 16లో 1.8 శాతం మాత్రమే ఉంది. ఉపాధి ఫార్మాస్యూటికల్ రంగం నుంచి 15.1 శాతం ఉపాధి లభించింది. సంగారెడ్డి జిల్లా సుల్తానాపూర్‌లోని మెడికల్ డివైజస్ పార్క్, హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ ద్వారా కొత్త పెట్టుబడులను, ఉపాధిని ఆకర్షించడంలో ప్రభుత్వం విజయం సాధించింది.

తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సంవత్సరం                 పరిశ్రమలు        పెట్టుబడులు
201415                       174                ….
201516                     1531           28,979
201617                     1705           34,236
201718                     2803           58,278
201819                     2796           34,508
201920                     3036           40,521
202021                     3431           16,094
202122                     4116           18,916
202223                     2518           20,237

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News