Friday, November 15, 2024

రూ. 400 కోట్లు చెల్లించాలంటూ ముకేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈమెయిల్

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీకి మూడోసారి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రూ. 400 కోట్లు చెల్లించకపోతే చంపివేస్తామంటూ ముకేష్ అంబానీకి మరోసారి ఈమెయిల్ వచ్చిందని మంగళవారం పోలీసులు వెల్లడించారు. అంబానీ కంపెనీకి చెందిన అధికారిక ఈమెయిల్‌కు సోమవారం బెదిరింపు లేఖ వచ్చిందని పోలీసులు తెలిపారు.

గత శుక్రవారం ముకేష్ అంబానీకి మొదటిసారి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రూ. 20 కోట్లు చెల్లించకపోతే ముకేష్ అంబానీని చంపివేస్తామంటూ ఈ లేఖలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గందేవి పోలీసు స్టేషన్‌లో ఎప్‌ఐఆర్ నమోదైంది. కాగా..శనివారం కంపెనీకి రెండవ ఈమెయిల్ వచ్చింది. రూ. 200 కోట్లు చెల్లించాలంటూ ఈ మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తాజాగా సోమవారం మూడవసారి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ లేఖలో రూ. 400 కోట్లు చెల్లించాలంటూ బెదిరించడం జరిగింది. ఈమెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గత ఏడాది అంబానీని, ఆయన కుటుంబ సభ్యులను చంపివేస్తామంటూ ఫోన్‌లో బెదిరించిన బీహార్‌లోని దర్భంగకు చెందిన ఒక వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని బాంబులతో పేల్చివేస్తానంటూ ఆ వ్యక్తి బెదిరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News