Monday, December 23, 2024

రాహుల్ బజాజ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Industrialist Rahul Bajaj Passed Away

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. బజాజ్ ఆటోకు మారు పేరుగా నిలిచిన రాహుల్ బజాజ్ వయస్సు 83 ఏళ్లు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే రాహుల్ బజాజ్ చివరి శ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. కొద్ది కాలంగా న్యుమోనియా, గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో రాహుల్ బజాజ్ బాధపడుతున్నారు. పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కన్ను మూశారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని గ్రూప్ అధికారి ఒకరు తెలిపారు. రాహుల్ బజాజ్‌కు ఇద్దరు కుమారులు రాజీవ్ బజాజ్, సంజీవ్ బజాజ్, కుమార్తె సునయన కేజ్రివాల్ ఉన్నారు.

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నితీశ్ గడ్కరీ, నారాయణ రాణె, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో పాటుగా పలు రాష్ట్రాల సిఎంలు,యావత్ భారత కార్పొరేట్ ప్రపంచం దిగ్భ్రాంతి , తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

1938 జూన్ 10న జన్మించిన రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూపునకు నాలుగు దశాబ్దాలకు పైగా చైర్మన్‌గా సేవలందించారు. గత ఏడాది బజాజ్ ఆటో చైర్మన్‌గా, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. గత ఏడాది మే1నుంచి ఐదేళ్ల కాలానికి గ్రూప్ గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు. వయోభారం వల్లే రాహుల్ బజాజ్ చైర్మన్ పదవినుంచి వైదొలగిలారని, ఆయన అనుభవం, విజన్‌నుంచి లబ్ధి పొందాలన్న లక్షంగా బజాజ్ గ్రూప్‌సంస్థ చైర్మన్ ఎమిరిటస్‌గా ఐదేళ్ల పాటు నియమించాలని కంపెనీ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సు చేసిందని బజాజ్ గ్రూప్ గత ఏడాది ఒక ప్రకటనలో తెలిపింది. భారత కార్పొరేట్ యాడ్ ఇండస్ట్రీలో బజాజ్‌గ్రూప్ కంపెనీలకు ఎంతో పేరుంది. ‘యు జస్ట్ కెనాట్ బీట్ ఎ బజాజ్’, ఐకానిక్ టూవీలర్ బజాజ్ స్కూటర్‌పై ‘హమారా బజాజ్’ ట్యాగ్‌లైన్లకు ఎంతో పాపులారిటీ వచ్చింది. గత ఐదు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో రాహుల్ బజాజ్ పాత్ర ఎంతో పెద్దది. 1965లో రాహుల్ బజాజ్ బజాజ్ గ్రూపు బాధ్యతలను చేపట్టారు. ఆయన నాయకత్వంలో బజాజ్ ఆటో టర్నోవర్ 7.2 కోట్లనుంచి 12 వేల కోట్ల రూపాయలకు పెరిగింది.

దేశీయంగా స్కూటర్ల విక్రయంలో బజాజ్ అగ్రస్థానంలో నిలిచింది. బజాజ్ చేతక్ స్కూటర్ మధ్య తరగతి భారతీయుడి అచ్చుమెచ్చిన వాహనంగా నిలిచింది. 2005లో తన తనయుడు రాజీవ్ బజాజ్‌కు రాహుల్ బజాజ్.. గ్రూప్ బాధ్యతలను అప్పగించారు. రాజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జాతీయ స్థాయినుంచి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు, వివిధరకాల ఉత్పత్తులను గ్రూప్ సేవలను విస్తరించారు. 2001లో భారత దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ను రాహుల్ బజాజ్ అందుకున్నారు.2006నుంచి 2010 వరకు రాజ్య సభ సభ్యుడిగానూ పని చేశారు. పలు యూనివర్శిటీలనుంచి అనేక గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. ఇండియన్ ఎయిర్‌లైన్‌స చైర్మన్‌గా, ఐఐటి బాంబే గవర్నర్ల బోర్డు చైర్మన్‌గా కూడా పని చేశారు. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్‌తో పాటు పలు సేవా సంస్థల ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News