న్యూస్ డెస్క్: పుట్టిన మూడు రోజులకే శిశువు పాకడం ఎక్కడైనా సాధ్యమేనా? ఈ వీడియో చూస్తే ఎవరైనా నమ్మి తీరాల్సిందే. అమెరికాలో నిపెన్సిల్వేనియాలోగల వైట్ ఓక్‌లో నివసించే సమంత మెషెల్ అనే 34 ఏళ్ల మహిళ ఒక ఆడ శిశువును ప్రసవించింది. ఆ పాపకు డెసీ జబారీ అని పేరు కూడా పెట్టుకుంది.
Also Read: పామును కొరికి చంపిన బాలుడు
పుట్టిన మూడు రోజులకే ఆ శిశువు తల పైకెత్తడమే కాక మంచంపైన పాకడం మొదలుపెట్టడంతో తల్లి షాకయ్యింది. ఎవరికైనా చెబితే నమ్మరేమోనన్న అనుమానంతో ఆమె తన చిన్నారి శిశువు పాకడాన్ని వీడియో తీసి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
సాధారణంగా శిశువులు పాకడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పడుతుంది. తలపైకెత్తడానికి కూడా నెలలు పడుతుంది. కాని..ఈ చిన్నారి మాత్రం మూడు రోజులకే తలపైకెత్తి చేతులు కదులుస్తూ పాకడం చూసి నెటిజన్లు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆ పాపను వండర్ కిడ్‌గా అభివర్ణిస్తున్నారు.