Friday, January 10, 2025

ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మృతి..

- Advertisement -
- Advertisement -

పట్టణంలోని నెక్కొండ రోడ్డులో గల బాలాజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ పసికందు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. డాక్టర్ నిర్లక్షం కారణంగానే పసికందు మృతిచెందిందని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహించారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామానికి చెందిన హర్షమల్లు తేజ రాజ్‌కుమార్ దంపతులకు జన్మించిన పసికందు మృతిచెందింది. పురిటి నొప్పులతో శనివారం రాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ కాగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఆదివారం ఉదయం డెలివరీ చేయగా పసిపాప డెలివరీ అనంతరం కొంతసేపటికి మృతిచెందింది.

దీంతో వైద్యురాలు నిర్లక్షం కారణంగా పాప మృతిచెందిందని ఆమె బంధువులు ఆసుపత్రిలో ఆందోళన నిర్వహించారు. సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైనా సమస్య ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆసుపత్రి ముందు గొడవ చేయకూడదని సూచించారు. దీంతో ఆందోళన విరమించి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

ఈ విషయమై డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ.. పాప మృతిచెందడంలో తన నిర్లక్షం లేదని డెలివరీకి ముందు డెలివరీ తరువాత పాప బాగానే ఉందని ఆమె తెలిపారు. ఈ విషయమై నర్సంపేట ఎస్సై రవీందర్ మాట్లాడుతూ.. బాలాజీ ఆసుపత్రిలో పసికందు మృతికి సంబంధించిన బాధితులు వచ్చారు కాని మళ్లీ వారే బయట సెటిల్ చేసుకుంటామని వెళ్లిపోయారని, ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News