మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా బారిపడిన ఓగర్భిణికి మాతృత్వాన్ని ప్రసాదించి నెలల నిండకముందే ప్రసవించిన శిశువుకు కిమ్స్ వైద్యులు ఊపిరిపోసి అమ్మఒడికి చేర్చారు. నగరానికి చెందిన 28 వారాల గర్భిణీ కరోన తీవ్రమైన లక్షణాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు కొండాపూర్ కిమ్స్‌కు తరలించారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి వెంటలేటర్‌పై చికిత్స పొందుతుండగా ఏప్రిల్ 17న శిశుకు జన్మనిచ్చింది. శిశువుకు మొదటి టెస్టు చేసినప్పడు నెగటివ్ రాగా రెండోసారి చేస్తే పాజిటివ్ వచ్చింది. దీంతో బరువు తగ్గడంతోపాటు ఆక్సిజన్ తీసుకోవడంతో ఇబ్బంది పడుతుండటంతో ఐసోలేషన్‌కు తరలించి చికిత్సను ప్రారంభించారు. ఈసందర్భంగా కిమ్స్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డా.అపర్ణ మాట్లాడుతూ నవజాత శిశువుపై మావైద్యుల బృందం ప్రత్యేక దృష్టిసారించి ఐసోలేషన్ నియోనాటల్ ఐసీయూలో చికిత్సనందించినట్లు తెలిపారు. ఆసుపత్రి దాదాపు 30 రోజులు మెరుగైన చికిత్సచేసి శిశువు బరువు పెరిగేలా చేసి ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు.