- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికీ ప్రతి రోజు 200 నుంచి 250 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన చోట ఇన్‌ఫెక్షన్ రేటు తక్కువగా ఉందన్నారు. అర్హులైన ప్రజలంతా తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. కరోనా మృతులకు పరిహారంపై ఇంత వరకు కేంద్రం గైడ్‌లైన్స్ జారీ చేయలేదన్నారు. కరోనా రోగుల కోసం 50 వేల బెడ్లు ఉంటే 1800 మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారన్నారు. ఆస్పత్రుల్లో ఉన్నవారిలో 30 నుంచి 40 శాతం దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్లే ఉన్నారని తెలియజేశారు. తెలంగాణలో రోజుకి మూడు లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నామని, రెండు డోసులు తీసుకుంటేను సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు.
- Advertisement -