- Advertisement -
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని ఉరి సెక్టార్‌కు చెందిన వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి జరిగిన ఒక చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌కు చెందిన కమల్‌కోట్‌లో ఎల్‌ఓసి వెంబడి అనుమాస్పద కదలికలను సైనిక బలగాలు గుర్తించాయని గురువారం అధికారులు తెలిపారు. చొరబాటుదారులను అడ్డుకోవడానికి సైనిక దళాలు కాల్పులు జరిపాయని, అటువైపు నుంచి కాల్పులు జరిగాయని వారు చెప్పారు. దట్టమైన మంచు కురుస్తున్న కారణంగా చొరబాటుదారులకు ఎటువంటి నష్టం జరిగిందో వెంటనే తెలియరాలేదని వారు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సైనిక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని వారు వివరించారు.
- Advertisement -