Thursday, January 23, 2025

రెండు నెలల్లో ఎపి రాజధానిగా విశాఖ: మంత్రి గుడివాడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం మారబోతుందని ఆ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఇన్ఫెనిటీ వైజాగ్ 2023 ఐటీ సదస్సు శనివారం నాడు ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడారు.. విశాఖ నగరాన్ని ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

విశాఖలో ఉన్న అవకాశాలను చూసి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కంపెనీలు రావడంతో మరింత మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఐటాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News