Thursday, January 23, 2025

వరుసగా 14వ సారి..

- Advertisement -
- Advertisement -

రెండంకెల్లోనే కొనసాగుతున్న టోకు ద్రవ్యోల్బణం
మేలోనూ 15.88 శాతానికి పెరిగిన సూచీ

Inflation decreases purchasing power

న్యూఢిల్లీ : టోకు ద్రవ్యోల్బణం వరుసగా 14వ నెలలో నూ రెండంకెల స్థాయిలోనే ఉంది. టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపిఐ) ద్రవ్యోల్బణం మేలో 15.88 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌లో ఇది 15.08 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 2022 మార్చిలో 14.55 శాతం వద్ద ఉండగా, ఫిబ్రవరిలో 13.11 శాతం నమోదైంది. కూరగాయలతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరగడంతో టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. 1998 డిసెంబర్‌లో డబ్లుపిఐ 15.32 శాతంగా నమోదవగా, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిని దాటి టోకు ద్రవ్యోల్బ ణం పెరిగింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశా ఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఆహార ద్రవ్యోల్బ ణం ఏప్రిల్‌లో 8.88 శాతం నుంచి మేలో 10.89 శా తంకి చేరుకుంది. కూరగాయల ద్రవ్యోల్బణం 23.24 శాతం నుంచి 56.36 శాతానికి పెరిగింది.

బంగాళదుం ప ధరలు 19.84 శాతం నుంచి 24.83 శాతానికి పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపల ధరలు కూడా 4.50 శా తం నుండి 7.78 శాతానికి పెరిగాయి. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. వీటి ధరలు -4.02 శాతం నుండి -20.40 శాతానికి తగ్గాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బ ణం 10.85 శాతం నుంచి 10.11 శాతానికి తగ్గింది. ముడి పెట్రోలియం, ఆహార పదార్థాల ధరలు పెరిగా యి. సామాన్యులపై డబ్ల్యుపిఐ ప్రభావం ఉండనుంది. టోకు ద్రవ్యోల్బణం దీర్ఘకాలికంగా పెరగడం ఆందోళన కలిగించే అంశం కాగా, ఇది ఎక్కువగా ఉత్పాదక రం గాన్ని ప్రభావితం చేస్తోంది. మరోవైపు ఇంధనం, వి ద్యుత్ వంటి ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతం నుంచి 7.04 శాతానికి త గ్గింది.

సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతానికి త గ్గింది. ఏడాది క్రితం 2021 మేలో ఇది 6.30 శాతంగా ఉంది. అయితే ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బిఐ గరిష్ట పరిమితి అయిన 6 శాతం దాటడం వరుసగా ఇది ఐదవ నెల కావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 6.95 శాతం, ఏప్రిల్‌లో 7.79 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం మేలో 8.38 శాతం నుంచి 7.97 శాతానికి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News