Wednesday, January 22, 2025

వచ్చే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 7.4 శాతంతో 15 నెలల గరిష్ఠానికి చేరగా, వచ్చే నెలల్లోనూ ఇది మరింత పెరిగి అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ హెచ్చరించింది. జులై నెల ఆర్థిక సమీక్ష నివేదికను ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. నివేదిక ప్రకారం, రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగవచ్చు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ ధరల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.

ఈ నివేదికలో ఆగస్టు నెలలో రుతుపవనాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ వినియోగం, పెట్టుబడులు పెరగడం వల్ల ఆర్థిక వృద్ధి వేగం కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. కానీ ప్రపంచ, ప్రాంతీయ అస్థిరతతో పాటు దేశీయ సరఫరా ఆంక్షల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి అలాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌బిఐ చాలా అప్రమత్తంగా ఉండాలని నివేదికలో కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News