Monday, December 23, 2024

బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ద్రవ్యోల్బణం దూసుకెళ్తోంది: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసరాల ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని, ఇందుకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మోడీ ప్రభుత్వం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ ఇంకా రాలేదు కానీ .. ద్రవ్యోల్బణం మాత్రం ఆ రైలు కన్నా వేగంగా దూసుకెళ్తోందని విమర్శించింది. దీంతో సామాన్యుడి వెన్ను విరుగుతోందని ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

“గత పదిన్నరేళ్లలో ద్రవ్యోల్బణం రెండుమూడు రెట్లు పెరిగింది. కూరగాయలు, వంటనూనె, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. మోడీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటీ ఖరీదైపోతోంది. టమాటాల నుంచి ఆలుగడ్డ వరకు నూనెలు, పాలు, సామాన్యులకు దూరమవుతున్నా” యని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. మీరు వాగ్దానం చేసిన మంచి రోజులంటే ఇవేనా? అని ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రజలు సమాధానం కోరుకుంటున్నారని అన్నారు. అంతేకానీ వాక్చాతుర్యం కాదన్నారు. నిత్యావసర ధరలు రోజురోజుకు పెరుగుతున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలను షేర్ చేసిన జైరాం రమేశ్, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News