Monday, November 18, 2024

దేశ ప్రజలకు ఉద్యోగాలు లేవు

- Advertisement -
- Advertisement -

వారిపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది
ప్రజలు జాగృతం కావాలి
వారిని తప్పుడోవ పట్టిస్తున్నారు
ఛత్తీస్‌గఢ్ కోర్బాలో న్యాయ్ యాత్రలో రాహుల్
కోర్బా : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని, వారిని ద్రవ్యోల్బణం బాధిస్తోందని ఆయన ఆరోపించారు. తన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఛత్తీస్‌గఢ్ కోర్బా నగరంలో సీతామడి ప్రాంతంలో ఒక సభలో రాహుల్ ప్రసంగిస్తూ, ప్రజలు జాగృతం కావాలని పిలుపు ఇచ్చారు.

వారి జేబులు దోచుకుంటున్నారని, వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కుల గణన జరిపించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను రాహుల్ పునరుద్ఘాటించారు. ప్రజల మద్దతుతో ఆ పని జరుగుతుందని ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతులు, దళితులు, ఆదివాసీలు దేశ జనాభాలో 74 శాతం మేర ఉన్నారని, కాని ఆ సమాజాలలో నుంచి ఒక్కరూ భారత్‌లోని 200 అగ్రశ్రేణి సంస్థల యజమాని కారని, యాజమాన్యంలో కూడా లేరని, ఆ సంస్థలకు ‘దేశంలోని డబ్బు ఇస్తున్నారు’ అని రాహుల్ చెప్పారు.

బిజెపి‘హిందు రాష్ట్ర’అని అంటుందని, కానీ జనాభాలో 74 శాతం మందికి, దేశంలోని పేదలకు ఏదీ దక్కడం లేదని ఆయన విమర్శించారు. రాహుల్ కేంద్రాన్ని మరింతగా లక్షం చేసుకుంటూ వారు కంచం చప్పుడు చేస్తున్నారని, గంట కొడుతున్నారని, మొబైల్ ఫోన్‌లు చూపుతున్నారని, ఆకలితో చనిపోతున్నారని ఆరోపించారు. ‘(క్రితం నెల) రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏ నిరుపేదనైనా, కూలీనైనా, నిరుద్యోగినైనా, చిన్న వాణిజ్యవేత్తలనైనా చూశారా చెప్పండి. నాకు అదానీజీ, అంబానీజీ, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఇతర బడా వాణిజ్యవేత్తలు కనిపించారు. అదానీజీ, అంబానీజీ, వారి కుటుంబాలు బడా ప్రకటనలు ఇచ్చారు’ అని రాహుల్ అన్నారు. ప్రజలకు ఉద్యోగాలు రావడం లేదని, వారు ద్రవ్యోల్బణం ప్రభావానికి గురవుతున్నారని, మరొక వైపు ‘అదానీ, అంబానీ చైనీయుల వస్తువులు అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. దానిని ఆర్థికపరమైన అన్యాయంగా రాహుల్ అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News