శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 29వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు ఉండగా శనివారం సాయంత్రం వరకు 1082.3 అడుగులు 51.659 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈఈ రవి తెలిపారు. ఆయకట్టు పంటల సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ కాకతీయకు 3000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 50 క్యూసెక్కులు,
మంచినీటి అవసరాలకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 541 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1090.60 అడుగులు 78.868 టిఎంసిలుగా ఉందని అన్నారు. ఒకటి జూన్ నుండి ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 52.599 టిఎంసిల నీరు వచ్చి చేరిందని, ఒకటి జూన్ నుండి ఇప్పటి వరకు 9.096 టిఎంసిల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.