Monday, December 23, 2024

పిల్లల అంధత్వం వెనుక రక్త సంబంధాల ప్రభావం

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద 19 మిలియన్ మంది పిల్లలు దృష్టి మాంద్యంతో బాధపడుతుండగా, వారిలో 1.4 మిలియన్ మంది అంధత్వంతో అలమటిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయి అంధత్వ నివారణ కార్యక్రమం అందించిన వివరాల ప్రకారం ప్రతి పది వేల మంది పిల్లల్లో ఎనిమిది మంది భారత దేశంలో పసితనం నుంచే అంధత్వానికి గురవుతున్నారని తెలుస్తోంది. కర్ణాటక లోని రెండు తాలూకాల్లో జరిపిన అధ్యయనంలో పసిపిల్లల అంధత్వానికి కంటిపాప అంధత్వం ప్రధాన కారణం కాదని గుర్తించడమైంది. అయితే అనివార్య కారణాల వల్ల అంధత్వం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రపంచం మొత్తం మీద కొన్ని విపరీతాలు అంధత్వానికి దారి తీస్తున్నాయని బయటపడింది. చిన్న కన్ను లేదా కళ్లు లేకపోవడం , కంటిలోపలి పొరల్లో ఖాళీ లేదా లోపం ఏర్పడడం అంధత్వానికి ప్రధాన కారణాలుగా రూఢి అయింది. 2012 ఆగస్టు నుంచి 2013 డిసెంబర్ వరకు కర్ణాటక లోని తుముకూరు జిల్లాలో 30 గ్రామాలు , 25 అర్బన్ వార్డుల్లో 15 ఏళ్ల లోపు వయసున్న 8000 మంది పిల్లల కళ్లను పరీక్షించారు. ఈ పరిశీలనలో మెడికల్ సోషల్ వర్కర్లు దృష్టి లోపం ఉన్న పిల్లలను ఎంపిక చేశారు. తరువాత వారి కంటి పరీక్షను స్థానిక ఆప్తమాలజిస్టుచే చేయించారు. పరీక్షించిన వారిలో 550 మంది పిల్లల కంటి లోపాలను కనుగొన్నారు. కనుగుడ్డు పొడవు, లేదా కార్నియా ఆకారం వల్ల దృష్టి లోపాలు సంభవించి దృశ్యాలను కన్ను గ్రహించలేక పోవడం కనిపించింది. చిన్నపిల్లలు ఎక్కువగా అంధత్వానికి గురికావడం విటమిన్ ఎ లోపించి కార్నియా దెబ్బతినడం వల్లనే జరిగిందని 1990లో కనుగొన్నారు. ఆ సమయంలో జాతీయస్థాయిలో విటమిన్ ఎ లోపంపై నిర్వహించిన కార్యక్రమం వల్ల ఈ వ్యాధి చాలా వరకు అదుపు లోకి వచ్చింది. అయితే నివారించలేని కారణాల వల్ల అంధత్వం దాపురించే కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. డెలివరీ లోను, లేదా మరేదైనా ప్రమాదం లోను మెదడు లోని కార్టికల్ ఏరియాకు నష్టం జరిగితే చేసేదేమీ ఉండదు. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు తక్కువ దృష్టి ఉంటే చూపు నిలబెట్టడానికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. మేనరికం వివాహాలు వంటి దగ్గరి రక్త సంబంధ వివాహాల కారణంగా బిడ్డల్లో అంధత్వం ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు 34 శాతం మంది దృష్టి లోపంతో బాధపడడానికి వారి తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు కారణంగా వైద్యులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News